fbpx
Thursday, April 24, 2025
HomeMovie Newsసూర్య 'ఆకాశం నీ హద్దురా' ట్రైలర్ విడుదల

సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్ విడుదల

AakashamNeeHaddura Trailer Released

కోలీవుడ్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’. గురు ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది. ఏవియేషన్ కి సంబందించిన కొన్ని అధికారిక పెర్మిషన్స్ వలన విడుదల ఆగిపోయింది. ఐతే ఇప్పుడు కొత్తగా అప్రూవల్స్ తీసుకున్న తర్వాత నవంబర్ 12 న ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడం తో పాటు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపినాథ్ కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి.

ఒక సామాన్యుడి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని ట్రైలర్ చూస్తే అర్ధం ఆవుతుంది. ‘వ్యవసాయం చేసేవాడు కూడా విమానం ఎక్కుతాడు’ అనే డైలాగ్ ని బట్టి చూస్తే సినిమా కథ లోని ఇంటెన్సిటీ అర్ధం అవుతుంది. ఒక్క రూపాయి పెట్టి విమానం టికెట్ కొని ప్రయాణం చెయ్యడానికి హీరో సంకల్పం దానికి హీరో పడిన , ఎదుర్కొన్న కష్టాలు ఏంటని సినిమా కథ అని అర్ధం అవుతుంది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

Aakaasam Nee Haddhu Ra ! - Official Trailer | Suriya, Aparna | Sudha Kongara | Amazon Original Movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular