టాలీవుడ్: గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఆకాశవాణి అనే సినిమా గురించి అపుడపుడు టాక్ నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా నుండి విదులయ్యే పోస్టర్స్ ప్రత్యేకంగా ఉండి ఆకట్టుకున్నాయి. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ‘ఆకాశవాణి ప్రపంచం’ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేసారు. పేరుకు తగ్గట్టే ‘ఆకాశవాణి’ ప్రపంచాన్ని మనకి పరిచయం చేసినట్టు వుంది. ఒక పల్లె సెట్, ఆ పల్లెలో ఉండే పిల్లలు, పెద్దలు, వాళ్ళు మొక్కే దైవం ఇలా అన్ని ఎలెమెంట్స్ ని కవర్ చేస్తూ వాళ్ళకి అడ్డు వచ్చిన ఆపద.. ఇలా ఒక్కో అంశాన్ని కొన్ని సెకన్ల వ్యవధిలో చూపిస్తూ అసలు కథ ఏంటి అనేది సస్పెన్స్ మైంటైన్ చేయగలిగాడు డైరెక్టర్.
టీజర్ లో చూపించిన విజువల్స్, బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ సురేష్ రేగుతూ అందించారు. సంగీతం కీరవాణి కుమారుడు కాల భైరవ అందించారు. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి మాటలు అందించాడు. అశ్విన్ గంగరాజు అనే దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. AU &I స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభ రెడ్డి ఈ సినిమాని నిర్మించాడు. తమిళ నటుడు సముద్రఖని ఈ సినిమాలో మరో కొత్త పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమా విడుదల వివరాలు మరి కొద్దీ రోజుల్లో వెల్లడించనున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా టీజర్ ఒక ఫ్రెష్ నెస్ అనుభూతిని మిగిల్చింది. ఇండస్ట్రీ వర్గాల నుండి కూడా ఈ సినిమా విజువల్స్ కి మరియు బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కి ప్రత్యేక అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.