టాలీవుడ్: గౌతమ్ కృష్ణ అనే కొత్త నటుడు హీరోగా ‘ఆకాశ వీధుల్లో’ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. ఫస్ట్ లుక్ ని క్రిష్ జాగర్లమూడి చేతులమీదుగా విడుదల చేయించగా టీజర్ ని గోపీచంద్ మలినేని విడుదల చేసారు. ఈ సినిమాని గౌతమ్ కృష్ణ హీరో మాత్రమే కాకుండా డైరెక్క్షన్ కూడా చేసారు. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ నటించారు.
సిద్దు ఎవ్వరి మాట వినని రాక్ స్టార్ అని టీజర్ ప్రారంభించారు. టీజర్ లో హీరో డ్రగ్ అడిక్ట్, ఆల్కహాలిక్ అని, అమ్మాయిలు అని, గొడవలు అని హీరో కి ఉన్న అవలక్షణాలన్నీ టీజర్ లో చూపిస్తారు. ఇవన్నీ ఉన్నా కూడా మోస్ట్ సెలెబ్రెటీడ్ రాక్ స్టార్ అని చూపిస్తారు. ఈ రాక్ స్టార్ కోసం ఫాన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నట్టు చూపిస్తారు. చివర్లో రాక్ స్టార్ కాదు మాన్స్టర్ అన్నట్టు చూపించి టీజర్ ముగించారు. ఒకరకంగా చూస్తుంటే బాలీవుడ్ లో రణ్బీర్ కపూర్ నటించిన రాక్ స్టార్, మరియు తెలుగు లో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా పోలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఒక భిన్నమైన ప్రేమ కథ అని పిస్తుంది కానీ ప్రతీ ఫ్రేమ్ లో ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి సీన్ చూసాం అన్న ఫీల్ కలుగుతుంది. మరి సినిమా ట్రైలర్ అయినా ఎలాంటి పోలికలు కనపడకుండా చూసుకుంటే బాగుంటుంది. జీకే ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై మనోజ్ , మణికంఠ నిర్మాతలుగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా విడుదల వివరాలు మరికొద్దిరోజుల్లో తెలియచేయనున్నారు.