టాలీవుడ్: పూరి జగన్నాథ్ వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యి హీరో గా కూడా సినిమాలు చేస్తున్నాడు ఆకాష్ పూరి. ‘మెహబూబా’ అనే లవ్ స్టోరీ తో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో హీరోగా పరిచయం అయ్యాడు ఆకాష్. మొదటి సినిమానే ఒక వెరైటీ ప్రేమ కథతో పూరి ఆకాష్ ని లాంచ్ చేసాడు కానీ ఆశించిన ఫలితం రాలేదు. రెండవ సినిమాని ‘రొమాంటిక్’ అనే టైటిల్ తో రూపొందించారు. చాలా రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్స్ ఏమీ విడుదల చేయలేదు. ఇంతలోనే ఆకాష్ పూరి చేయబోతున్న మూడవ సినిమా ప్రకటన విడుదల చేసారు. ఈ రోజు ఆకాష్ పుట్టిన రోజు సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన తదుపరి సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
‘చోర్ బజార్’ అనే టైటిల్ తో ఒక ఫుల్ మాస్ సినిమాతో ఆకాష్ పూరి ఈ సారి రానున్నాడు. ఫస్ట్ లుక్ లో చేతిలో ఒక గన్ పట్టుకుని మాస్ లుక్ లో ఉన్నాడు. చోర్ బజార్ టైటిల్ ట్లో కూడా బైక్, కార్ కి సంబందించిన స్పేర్ పార్ట్శ్ మరియు గన్స్ ని కలిపి డిజైన్ చేసారు. ‘జార్జ్ రెడ్డి’ సినిమాని డైరెక్ట్ చేసిన జీవన్ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. IV ప్రొడక్షన్స్ బ్యానర్ పై వి.ఎస్. రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఆకాష్ చోటా బచ్చన్ అనే రోల్ లో నటించనున్నట్టు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసారు.
Motion poster of #ChorBazaar. Agaya hai Bachan Saab 💥⛓💎💰⛓💥@GeorgeReddyG1 @VSRajuOfficial @IVProductions_ @actorsubbaraju @sureshbobbili9 #JagadeeshCheekati @sureshvarmaz @GskMedia_PR pic.twitter.com/yFRzsHU7AD
— Akash Puri (@ActorAkashPuri) July 25, 2021