సినిమా పరిశ్రమలో అత్యంత పెద్ద సమస్యగా నిలుస్తున్న పైరసీ నిర్మాతల తలనొప్పిగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మాత్రం పైరసీ వల్ల తనకు లాభం జరిగిందని చెబుతున్నాడు. అది కూడా 3 ఇడియట్స్ సినిమాతో.
2009లో విడుదలైన 3 ఇడియట్స్ భారతదేశంలో కల్ట్ క్లాసిక్‌గా మారింది. అయితే, చైనాలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడంతో, అక్రమంగా సీడీలు, డీవీడీల రూపంలో అక్కడి ప్రేక్షకుల వద్దకు చేరింది. ఈ పైరసీ వల్ల అమీర్ ఖాన్ చైనాలో స్టార్ అయ్యాడని స్వయంగా వెల్లడించాడు.
అక్కడి ఆడియన్స్ ఆయన నటనకు ఫిదా అయ్యారు. ఈ క్రేజ్‌తోనే దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలు చైనాలో భారీ వసూళ్లు సాధించాయి.
అయితే, ఈ విషయం 17 ఏళ్ల క్రితం కాబట్టి సాధ్యమైంది. ఇప్పుడు చైనాలో కఠిన చట్టాలు ఉన్న కారణంగా పైరసీ సాధ్యం కాదు.