ఆంధ్రప్రదేశ్: రాజకీయాల్లో కొత్త గళం వినిపించబోతోంది. మాజీ ఐపీఎస్ అధికారి ఆలూరి బాల వెంకటేశ్వరరావు (ABV) అధికారికంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
కోనసీమ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన ఆయన, జగన్‌పై ప్రజాస్వామ్య బాటలో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
“జగన్ భరతం పట్టేందుకే రాజకీయాల్లోకి వస్తున్నా. పదవుల కోసం కాదు, ప్రజల కోసం నా ప్రయాణం,” అని ఏబీవీ చెప్పారు.
జగన్ హయాంలో తనపై జరిగిన అన్యాయాన్ని గుర్తుచేసిన ఆయన, న్యాయం కోసం ఉద్యమిస్తానని భావోద్వేగంగా తెలిపారు.
గతంలో ఆయనను చంద్రబాబు సలహాదారుగా నియమించగా, తరువాత బకాయిలు చెల్లించడంతో వైరల్ అయ్యారు.
ఠాణేలంక గ్రామంలో కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన ఏబీవీ, “ఇలాంటి బాధితులెందరో ఉన్నారు. వారికి నేను గళంగా నిలుస్తా,” అని హామీ ఇచ్చారు.
ప్రజలు తమ సమాచారం 7816020048 వాట్సాప్ నంబర్‌కు పంపాలంటూ పిలుపునిచ్చారు.
తన ప్రయాణం ఏ పార్టీ ద్వారా కొనసాగుతుందో త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. ఏబీవీ రాజకీయ రంగప్రవేశం జగన్ శిబిరంలో కలకలం రేపుతోంది.
చురుకైన మాజీ అధికారిగా ఇప్పుడు ప్రజానాయకుడిగా మారిన ఆయనను పలువురు నేతలు గమనిస్తున్నారు.