ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
నిన్న మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో కంపెనీలో జరిగిన పేలుడుతో తీవ్ర స్థాయిలో విధ్వంసం సంభవించింది. పేలుడు ధాటికి సిబ్బందికి అక్కడి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు కార్మికులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నట్టు పీఎంవో ప్రకటించింది.
గాయపడినవారికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోదీ, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు.
ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాల్లో పరిశీలన చేయడానికి ఉన్నత స్థాయి విచారణను ఆదేశించారు. తదనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కూడా స్పందిస్తూ, 18 మంది మృతి కలచివేసిందని, ఈ విషయంలో సంబంధిత శాఖలు సమన్వయంతో కలిసి ముందుకు వెళ్లాలని సూచించారు.