టాలీవుడ్: ప్రస్తుతం ఏ సినిమా గురించి అప్ డేట్ వచ్చినా, టీజర్స్ వచ్చినా, ఏవైనా ఇంటర్వూస్ వచ్చినా వాటిపైన సోషల్ మీడియా లో మీమ్స్ పేరుతో ట్రోల్ల్స్ చేస్తుంటారు. ఇది వరకు కొన్ని ఈవెంట్స్ లో చిరంజీవి ఇచ్చిన లీక్స్ పైన సోషల్ మీడియా లో మీమ్స్ వేసి ట్రోల్ చేసారు. ఇప్పుడు ఆ మీమ్స్ తోనే ‘ఆచార్య’ సినిమా కి సంబందించిన ఒక అప్ డేట్ ని రివీల్ చేసారు. మెగా స్టార్ చిరంజీవి కి మరియు డైరెక్టర్ కొరటాల శివ కి మధ్య జరుగుతున్న ఒక సంభాషణ కి మీమ్ ప్రిపేర్ చేసి టీజర్ విడుదల తేదీ ని ప్రకటించారు.
మీమ్ లో డైరెక్టర్ కొరటాల శివ ని చిరంజీవి టీజర్ గురించి ఎపుడు అప్ డేట్ ఇస్తావ్ అని నిలదీసినట్టు ‘ఏమయ్యా కొరటాల.. న్యూ ఇయర్ అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది.. ఆచార్య టీజర్ ఎపుడు విడుదల చేస్తావ్.. ఎపుడో చెప్పకపోతే నేనే లీక్ చేస్తా..’ అని పెట్టి దానికి రిప్లై గా కొరటాల ‘రేపు పొద్దున్నే ప్రకటిస్తా సార్.. రేపు మార్నింగ్ టీజర్ ఎపుడు విడుదల చేస్తాం అనేది ప్రకటిస్తా’ అని రిప్లై ఇచ్చినట్టు మీమ్ ప్రిపేర్ చేసి టీజర్ విడుదల గురించి అప్ డేట్ ఇచ్చి ట్రెండ్ ఫాలో అవుతూ ప్రొమోషన్ కూడా కానిచ్చేశారు.