టాలీవుడ్: సాయికుమార్ కుమారుడు ఆది హీరోగా వరుస సినిమాలతో పలకరించనున్నాడు. ‘ప్రేమ కావాలి’, ‘లవ్ లీ’ సినిమాల తర్వాత ఆశించినంత సక్సెస్ రానప్పటికీ సినిమాల సంఖ్య మాత్రం తగ్గలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మొన్ననే తనతో ఇదివరకే ‘చుట్టాలబ్బాయి’ సినిమాని రూపొందించిన వీరభద్రం దర్శకత్వం లో ‘కిరాతక‘ అనే సినిమాని ప్రకటించారు. ఇపుడు డైరెక్టర్ కళ్యాణ్ జి గోగానా అనే డైరెక్టర్ రూపొందించే సినిమాని ప్రకటించాడు. ఈ సినిమాలో మరో పాత్రలో సీనియర్ నటుడు సునీల్ నటించనున్నాడు.
కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి ఇండస్ట్రీ లో టాప్ రేంజ్ కమెడియన్ గా ఉన్నప్పుడే హీరో గా మొదట కొన్ని హిట్లు సాధించినప్పటికీ ఆ సక్సెస్ ని నిలుపుకోలేకపోయాడు. తర్వాత మళ్ళీ కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేతికి వచ్చిన అవకాశాలతో ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించినంత సక్సెస్ ఐతే పొందలేకపోతున్నారు సునీల్. ప్రస్తుతం ఈ సినిమలో మరో స్పెషల్ రోల్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. విజన్ సినిమాస్ బ్యానర్ నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సాయి కార్తీక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే మిగతా నటుల వివరాలు తెలియాల్సి ఉంది.