హైదరాబాద్: లొక్డౌన్ ముగిసిన తర్వాత ప్రభుత్వం విధించిన నియమాలకు లోబడి షూటింగ్స్ చేసుకోవచ్చని అనుమతులు వచ్చిన తర్వాత సినిమా షూటింగ్స్ మొదలవ్వనప్పటికీ తక్కువ సిబ్బందితో సీరియల్స్ షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యాయి. కానీ షూటింగ్స్ మొదలుపెట్టిన వారం రోజులకే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాకూడా కొందరు అక్కడక్కడా కరోనా తాకిడికి గురవుతున్నారు.
ఈ మధ్యనే ‘ప్రభాకర్’ అనే సీరియల్ నటుడు కరోనా భారిన పడ్డాడు. ఇప్పుడు ఇంకొక సీరియల్ నటి, ఈ టీవీ లో టెలికాస్ట్ అయ్యే ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ నటి ‘నవ్య స్వామి‘ కరోనా బారిన పడ్డారు. నవ్యకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో బుల్లితెర రంగం షాక్ కు గురైంది. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. నవ్యకు కరోనా అని నిర్ధారణ కావడంతో యూనిట్ సభ్యులంతా ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి ప్రముఖ నిర్మాత ‘బండ్ల గణేష్’ కరోనా బారి నుండి కోలుకున్నాడని ఆయన ట్వీట్లని బట్టి అర్ధం అవుతుంది.