ముంబై: అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీకి భారీ షాక్ తగిలింది. సెబీ అదానీ గ్రూప్స్ వారి అదానీ విల్మార్ ఐపీవోకు భారీ షాక్‌ను ఇచ్చింది. విల్మార్ ఐపీవోకు అదానీ గ్రూపు ముందు అడుగులకు సెబీ అడ్డుకట్టవేసి చివరి నిమిషంలో షాక్ ఇచ్చింది. కాగా అదానీ విల్మార్ ఇష్యూ విలువను రూ. 4,500 కోట్లుగా అదానీ గ్రూప్స్ నిర్ణయించింది.
అదానీ మేనేజ్‌మెంట్ చేసిన పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనలపై సెబీ నుండి రెడ్ మార్క్ పడింది. దీని వల్ల వారి మదుపరులకు తీవ్ర నిరాశే ఎదురైంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ దాదాపు 50 శాతం వాటాలను అదానీ విల్మార్‌లో కలిగి ఉంది. విల్మార్ కంపెనీ ఫార్చ్యూన్ వంటనూనెలను తయారుచేస్తోంది. అదానీ గ్రూప్స్ సింగపూర్‌కు చెందిన విల్మార్ గ్రూప్‌కు చెందిన కంపెనీతో కలిసి పనిచేస్తోంది. శుక్రవారం అదానీ విల్మార్ పీఐ కి వెళ్ళగా, సెబీ అడ్డుకుంది.
అదానీ నుండి వచ్చిన ప్రతిపాదనలను సెబీ హోల్డ్‌లో పెట్టింది. సెబీ అదానీ విల్మార్ ఐపీవోను హోల్డ్‌లో ఉంచడంతో 30 రోజులపాటు ఐపీవో ఇష్యూకు వెళ్లకుండా బ్రేక్ పడింది. ఇప్పటికే అదానీ గ్రూప్స్ కంపెనీ సెబీ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొంటుంది. ఈ విషయంపై సెబీ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. అదానీ గ్రూప్స్‌కు చెందిన విదేశీ పోర్ట్‌పొలీయో పెట్టుబడులపై ఇన్వెస్టిగేషన్ చేపట్టనుంది.