న్యూయార్క్:బ్రిటిష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ న్యూయార్క్ ప్రెస్ ఏజెన్సీ తో కలిసి దక్షిణ ఆసియ లోని ‘400 మంది అంత్యంత ప్రతిభావంతులని’ ఎంపిక చేసారు. అందులో టాలీవుడ్ యువ హీరో ‘అడవి శేష్‘ స్థానం సంపాదించాడు. దక్షిణ ఆసియ లోని వివిధ దేశాలకి సంబందించిన వ్యక్తులని కల్చర్, ఆర్ట్స్, మీడియా ప్రధానంగా సెలెక్ట్ చేస్తారు. ఈ 400 మంది జాబితాలో భారతీయులే 200 పై చిలుకు. వివిధ వ్యక్తులని వాళ్ళ రంగాలలోని టాలెంట్ ని గుర్తించి వాళ్ళ కథలని ప్రచురించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఈ జాబితాలో భారత దేశం గర్వపడే సంగీత దర్శకుడు , ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మొదటి స్థానం లో ఉన్నారు. రెహమాన్ తో పాటు బాలీవుడ్ నుండి సోనూ నిగమ్, అద్నాన్ సామీ, జాకీర్ హుస్సేన్ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అడవి శేష్ ఒక వీడియో విడుదల చేసి ఈ విషయాన్నీ పంచుకున్నారు. తనకి చాలా ఆనందంగా ఉందన్నారు. కెరీర్ ప్రారంభం నుండి విలక్షణమైన పాత్రలు చేస్తూ వస్తున్నాడు శేష్. తాను హీరోగా మాత్రమే కాకుండా స్క్రీన్ ప్లే రైటర్ గా, స్టోరీ రైటర్ గా సినిమా మేకింగ్ లో మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో మహేష్ బాబు ప్రొడక్షన్స్ లో ‘మేజర్’ అనే సినిమాలో చేస్తున్నాడు.