టాలీవుడ్: తెలుగు లో ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో కొత్తదనం కోసం పరితపించి క్షణం, ఎవరు, గూఢచారి లాంటి సినిమాలు రూపొందించి వరుస విజయాల్ని కైవసం చేసుకున్న హీరో అడవి శేష్. ఈ హీరో ప్రస్తుతం మేజర్ అనే సినిమా చేస్తున్నాడు. ముంబై అటాక్స్ లో వీర మరణం పొందిన అమర జవాన్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ రోజు అడవి శేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ మధ్య విడుదలైన మేజర్ లుక్ టెస్ట్ వీడియో ఆకట్టుకుంది. శేష్ లుక్ మరియు మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ లుక్ ని ఇద్దర్ని కలిపి ఒక ఫోటో లాగా రూపొందించి మేజర్ లుక్ ఎలా వచ్చిందో చూపించారు.
ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్నారు. శేష్ నటించిన ‘గూఢచారి’ సినిమాకి దర్శకత్వం వహించిన శశి కిరణ్ తిక్కా ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ మరియు సోనీ పిక్చర్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మేజర్ లుక్ లో అడవి శేష్ ఆకట్టుకున్నాడు. మామూలుగా అడవి శేష్ సినిమా అంటే ఒక కొత్తదనం తో కూడుకున్న ఎక్స్పీరియన్స్ చెయ్యబోతున్నామనే ఆలోచనతో ప్రేక్షకులు వస్తారు అంతే కాకుండా ఇది ఒక నిజ జీవిత మేజర్ కథ కావడం తో ఈ సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. 2021 సమ్మర్ లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.