fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsజులై లో అడవి శేష్ 'మేజర్'

జులై లో అడవి శేష్ ‘మేజర్’

AdaviShesh MajorMovie ReleaseDateAnnounced

టాలీవుడ్: టాలీవుడ్ లో దాదాపు ఒక వారం రోజుల నుండి సినిమా రిలీజ్ ల అప్డేట్ పరంపర కొనసాగుతుంది. ఇపుడు మరో సినిమా ఆ లిస్ట్ లో జత కలిసింది. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తన సక్సెస్ గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్న అడవి శేష్ ప్రస్తుతం ‘మేజర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. 26 /11 ముంబై కాల్పుల్లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. గూఢచారి సినిమాని దర్శకత్వం వహించిన శశి కిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా నుండి ఇదివరకే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు మేజర్ లుక్ టెస్ట్ వీడియోలు ఆకట్టుకున్నాయి. ఒకే ఫ్రేమ్ లో మేజర్ ఉన్ని కృష్ణన్ మరియు అడవి శేష్ లుక్స్ చూపించి ఆకట్టుకుంది సినిమా టీం. ఈ సినిమాని జులై 2 న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది సినిమా టీం. ఈ సినిమాని సోనీ పిక్చర్స్ సమర్పణలో సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular