కోలీవుడ్: సైడ్ డాన్సర్ గా కెరీర్ ప్రారంభించి డాన్స్ మాస్టర్ గా, నటుడిగా , దర్శకుడిగా, హీరోగా రక రకాల పాత్రలు పోస్తిస్తూ ఇండస్ట్రీ లో తన సత్తా చాటుకుంటున్నాడు లారెన్స్. గత కొన్ని సంవత్సరాలుగా కాంచన సిరీస్ సినిమాలు, శివలింగ లాంటి హర్రర్ సినిమాలనే నమ్ముకున్నాడు లారెన్స్. ఇపుడు ఒక గ్యాంగ్ స్టర్ సబ్జెక్టు తో మన ముందుకి రానున్నాడు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ప్రకటన తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసారు మూవీ టీం. ‘ అదిఘారం’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది. లారెన్స్ కి ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
సినిమా ఫస్ట్ లుక్ లో లారెన్స్ ఒక చెఫ్ డ్రెస్ వేసుకుని చేతిలో ఒక పెద్ద కత్తి పట్టుకుని బ్యాక్ డ్రాప్ లో మలేషియా ట్విన్ టవర్స్ ని చూపించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ కూడా ఈరోజు విడుదల చేసారు. కత్తులు, గన్స్, బుల్లెట్స్ తో నిండిన ఈ మోషన్ పోస్టర్ లో మల్టిపుల్ పాస్ పోర్ట్స్ చూపించారు. టైటిల్ మరియు మోషన్ పోస్టర్ ని బట్టి చూస్తుంటే ఒక గ్యాంగ్ స్టర్ సినిమా పోలికలు కనిపిస్తున్నాయి. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వెట్రి మారన్ అందించిన కథతో ఈ సినిమా రూపొందనుంది. 5 స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై వెట్రిమారన్, కదిరేశన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శివ కార్తికేయన్ తో ‘కాకి సెట్టై’, ధనుష్ తో ‘ధర్మ యోగి’ లాంటి సినిమాలని రూపొందించిన దురై సెంథిల్ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు.