టాలీవుడ్: ముంబై అటాక్స్ లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడవి శేష్ మేజర్ పాత్రలో ‘మేజర్’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లోని ముఖ్యమైన సంఘటనలు అన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నట్టు దాని పైన చాలా వర్క్ చేసినట్టు సినిమా టీం ఇదివరకే వెల్లడించింది. ఈ రోజు మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జయంతి సందర్భంగా మేజర్ సినిమాకి సంబందించిన ఒక చిన్న వీడియో గ్లిమ్ప్స్ విడుదల చేసింది.
ఒక బిల్డింగ్ మంటల్లో ఉండగా అందులో ఉన్న మేజర్ ని ఈ వీడియో లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ లో మైక్రో ఫోన్ వాయిస్ లో ‘మేజర్ సందీప్ ఉన్నారా..ఇంకా ఎంత మంది ఉన్నారు’ అన్నట్టు వాయిస్ వినిపిస్తుండగా మేజర్ షాడో లుక్ ఈ వీడియో లో చూపించారు. బహుశా ఈ వీడియో తాజ్ లో ఉగ్రవాదుల దాడుల్లో మేజర్ చివరి క్షణాలు అన్నట్టు అర్ధం అవుతుంది. సోనీ పిక్చర్స్ సమర్పణలో మహేష్ బాబు, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ‘గూఢచారి’ డైరెక్టర్ శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా టీజర్ ని మర్చి 26 న విడుదల చేయనున్నారు అని కూడా మూవీ టీం ప్రకటించింది. జులై 2 న పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.