టాలీవుడ్ : 2019 సంవత్సరంలో ఎలాంటి అంచనాలు లేకుండా ఒక కొత్త హీరో తో దాదాపు రెండు కోట్ల చిన్న బడ్జెట్ తో నిర్మించబడి విడుదలై అనూహ్యమైన విజయం సాధించిన సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‘. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జోనర్ లో సెన్సిబుల్ కామెడీ తో సినిమా ఆద్యంతం ఆసక్తి కరంగా ఉంటుంది. ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి కి మంచి బ్రేక్ వచ్చింది. ఇప్పటికి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో ఎక్కువగా చూసిన రీజనల్ సినిమాగా ఈ సినిమా టాప్ లో ఉంది. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ తన పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ ఈ సినిమా గురించి మరొక అప్డేట్ విడుదల చేసాడు. ఈ సినిమా త్రీ పార్ట్శ్ ఉన్నాయని, స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని చెప్పాడు. అలాగే ఈ సినిమా ఇతర భాషల్లో రీ-మేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఇదివరకే బాలీవుడ్ కి హక్కులు అమ్ముడుపోయాయని తెలిపారు.
ఈ సినిమా జపాన్ లో కూడా వచ్చే నెలలో విడుదల అవబోతుందని స్పష్టం చేసారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్క. 11 సెప్టెంబర్ నుండి ఈ సినిమాని జపాన్ లో విడుదల చేస్తున్నారు. జపాన్ లో లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్లు ప్రారంభం అయ్యాయి. థియేటర్లు పునః ప్రారంభం అయిన తర్వాత అక్కడ విడుదలైన ప్రభాస్ సాహో సినిమా బాగానే కలెక్ట్ చేసింది. ‘మళ్ళీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలతో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గా పేరు పొందిన రాహుల్ యాదవ్ నక్క తన మూడవ సినిమాగా ‘మాసూద’ అనే హర్రర్ డ్రామా ని సాయికిరణ్ అనే కొత్త దర్శకునితో తియ్యబోతున్నట్టు కూడా తెలియ చేసారు.