fbpx
Saturday, January 18, 2025
HomeAndhra Pradeshప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిసేందుకు మ‌హిళా అఘోరి హంగామా

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిసేందుకు మ‌హిళా అఘోరి హంగామా

aghori-woman-meets-pawan-kalyan-highway-drama

విజయవాడ: గ‌త కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌హిళా అఘోరి సంచ‌ల‌నం సృష్టిస్తోంది. వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల‌ను భ‌యబ్రాంతుల‌కు గురిచేస్తున్న ఈ మ‌హిళ, సోమ‌వారం విజయవాడ-మంగళగిరి జాతీయ రహదారిపై హంగామా చేసింది.

తాను ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లుసుకోవాల్సిందేనంటూ ఆమె చేసిన ర‌చ్చ‌తో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. తాజాగా, జ‌న‌సేన కార్యాల‌యం ద‌గ్గ‌ర‌కు వెళ్తున్న ఈ మ‌హిళ‌ను పార్టీ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు.

ఒంటిపై బూడిద రాసుకుని, నూలు పోగు కూడా లేకుండా సంచరించిన ఈ మ‌హిళ ఆ ప్రాంతంలోని ప్రజల్లో భయం కలిగించింది. “పవన్‌ కల్యాణ్‌ను కలవకుంటే కదలేది లేదు,” అంటూ నడిరోడ్డుపై బైఠాయించింది.

జనసేన కార్యకర్తల సమాచారం మేరకు చేరుకున్న పోలీసులు, ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే, ఆమె నిరసన మరింత పెరిగింది.

ఈ సంఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని వాహనాలను పోలీసులు ముందుకు పంపించినప్పటికీ, మ‌హిళా అఘోరి భీతి ఇంకా కొనసాగింది. ఈ అంశం జనసేన కార్యాలయంలో కాస్త ఉద్రిక్తతను రేపింది.

కాగా, ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఈ సంఘటనపై ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

పోలీసులు ఈ మ‌హిళ‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular