టాలీవుడ్: 100 % తెలుగు అనే టాగ్ లైన్ తో మొదలయింది ‘ఆహా’ ఓటీటీ. మొదలు పెట్టిన కొద్దీ రోజుల్లో ఆదరణ తక్కువగా ఉండడంతో ఈ ఓటీటీ మనుగడ ప్రశ్నార్ధకం అయింది. కరోనా వచ్చినప్పటి నుండి ఓటీటీ లకి ఆదరణ పెరుగుతుండడం తో ఆహా కి మెల్లిగా యూజర్స్ పెరిగారు. మళయాళం లో ఉన్న మంచి హిట్ సినిమాలన్నిటిని వడ పోసి తెలుగు లో డబ్ చేసి విడుదల చేసారు. ఓటీటీ కోసమే సెపెరేట్ సినిమాలు, సిరీస్ లని రూపొందించి విడుదల చేసారు. కలర్ ఫోటో, భానుమతి కృష్ణమూర్తి, జోహార్, అర్ద శతాబ్దం లాంటి సినిమాలని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసి కంటెంట్ తో పాటు యూసర్ బేస్ ని కూడా పెంచుకున్నారు.
ఇన్ని రోజులు ఓటీటీ రిలీజ్ లతో సరిపెట్టుకున్న ఆహా ఇపుడు థియేటర్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలని, థియేటర్లలో విడుదల కాబోయే సినిమాలని ఆన్లైన్ స్ట్రీమ్ రైట్స్ కొంటూ తెలుగు ఓటీటీ మార్కెట్ ని లీడ్ చేసే బాటలో ఉంది. ఇప్పటికే నాగ చైతన్య లవ్ స్టోరీ, నాగ శౌర్య లక్ష్య లాంటి క్రేజీ సినిమాలని రిలీజ్ కి ముందే ఆన్లైన్ స్ట్రీమింగ్ రైట్స్ కొంది. ఈ మధ్య విడుదలైన ఎంటర్టైనర్ టాక్ తెచ్చుకున్న SR కల్యాణమండపం రైట్స్ కూడా కొని మరి కొద్దీ రోజుల్లో స్ట్రీమ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఐతే పెద్ద హీరోల సినిమాలు టచ్ చేయలేదు కానీ చిన్న హీరోల్లో ఎంటెర్టైనెర్స్ అన్నిటిని సొంతం చేసుకునే ప్లాన్ లో ఉన్నారు. ఏది ఏమైనా లోకల్ ఓటీటీ అయినా ఆహా ఇంటర్నేషనల్ ఓటీటీ అయినా ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి ఓటీటీ లకి మంచి కాంపిటీటర్ అయింది.