టాలీవుడ్: సంవత్సరం కన్నా ముందు మొదలైన తెలుగు ఓటీటీ ‘ఆహా’. అల్లు అరవింద్ ప్రారంభించిన ఈ ఓటీటీ 100 % తెలుగు కంటెంట్ అనే టాగ్ లైన్ తో ప్రారంభించబడింది. మొదట్లో పాత కంటెంట్, వేరే ప్లాట్ ఫార్మ్స్ లో ఉన్న సినిమాలే ఉన్నాయి అనే నెగటివ్ టాక్ వచ్చింది. కానీ కరోనా టైం లో ఈ ఓటీటీ బాగా పుంజుకుంది. వేరే భాషల్లో సూపర్ హిట్ అయిన కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలని ముఖ్యంగా మలయాళం సినిమాలని డబ్ చేసి ఈ ఓటీటీ లో అందుబాటులో ఉంచారు. ఇవే కాకుండా కొన్ని సినిమాలని లాక్ డౌన్ టైం లో ఈ ఓటీటీ లో డైరెక్ట్ విడుదల చేసారు.
ఈ మధ్య ‘భానుమతి రామకృష్ణ’, ‘సూపర్ ఓవర్’, ’11th అవర్’ లాంటి ప్యూర్ ఓటీటీ కంటెంట్ ని విడుదల చేసి మంచి వ్యూస్ సంపాదించింది. ఇవే కాకుండా కొన్ని సినిమాలని కూడా కొంటూ ఆహా ఓటీటీ లో విడుదల చేస్తుంది. మార్చ్ లో విడుదలైన గాలి సంపత్ సినిమాని ఓటీటీ లో విడుదల చేసింది. ప్రస్తుతం దాదాపు ఒక రెండు డైరెక్ట్ మూవీస్ మరియు ఒక థియరిటికల్ రన్ పూర్తి అయిన సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన కార్తీ నటించిన ‘సుల్తాన్’ సినిమాని ఈ శుక్రవారం నుండి ఆహా ఓటీటీ లో ఉంచబోతున్నారు. దీంతో పాటు ‘అర్ద శతాబ్దం’, ‘థాంక్ యు బ్రదర్’ లాంటి మరో రెండు చిన్న సినిమాలని డైరెక్ట్ విడుదల చేస్తుంది. ఇలా కంటెంట్ పరంగా ఆహా ఓటీటీ దూసుకెళ్తుంది. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ లకి తెలుగు కంటెంట్ లో గట్టి కాంపిటీషన్ ఇస్తుంది.