టాలీవుడ్: 100 పర్సెంట్ తెలుగు కంటెంట్ అని మొదలు పెట్టిన ఓటీటీ ‘ఆహా’ ఓటీటీ. డిజిటల్ స్ట్రీమింగ్ లో తన సత్తాని చాటుకోవడానికి సిద్ధం అవుతుంది. 2019 లో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా ఈ ఓటీటీ ప్రారంభం అయింది. మొదటి సంవత్సరం చాలా డల్ గా పాత సినిమాలు, డబ్బింగ్ సినిమాలతోనే నెట్టొకొచ్చింది ఈ ఓటీటీ. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి కంటెంట్ ని కొద్దీ కొద్దిగా పెంచుకుంటూ ఇపుడు భారీ కంటెంట్ ని సిద్ధం చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు అల్లు అరవింద్. దీపావళి ని పురస్కరించుకొని ఒక పెద్ద ఈవెంట్ ని సిద్ధం చేసి తమ ప్లానింగ్, ఫ్యూచర్ లో రాబోయే కంటెంట్ ని తెలియ చేస్తున్నట్టు తెలిపారు. దీనిని అల్లు అర్జున్ ప్రెసెంట్ చేయబోతున్నారు. ఈ ఓటీటీ కి అల్లు అర్జున్ ని ప్రచారకర్త గా చేయబోతున్నారని కూడా వార్తలు వచ్చేయి.
ఈ మధ్యనే కలర్ ఫోటో సినిమా ద్వారా ఈ ఓటీటీ లో సూపర్ హిట్ సినిమా వచ్చింది. అంతే కాకుండా వైవా హర్ష ద్వారా ఒక టాక్ షో, సమంత అక్కినేని ద్వారా ఒక టాక్ షో, సుమ ద్వారా మరో టాక్ షో ప్రస్తుతం ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇవే కాకుండా బిగ్బాస్ ఫెమ్ పునర్నవి నటించిన ‘కమిట్ మెంటల్’ అనే వెబ్ సిరీస్ ని ఈ వారం విడుదల చేయబోతున్నారు. వీటితో పాటు పాయల్ రాజపుత్ ప్రధాన పాత్రలో ‘అనగనగా ఓ అతిధి’, సిద్దు జొన్నల గడ్డ హీరోగా ‘మా వింత గాద వినుమా’ అనే ఒక సినిమా కూడా ప్రస్తుతం విడుదలకి సిద్ధం గా ఉన్నాయి. వీటితో పాటు ఇంకా చాలా కంటెంట్ మేకింగ్ స్టేజి లో ఉన్నాయి. నవంబర్ 13 న జరగబోయే వేడుక ద్వారా తమ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తో పాటు వాల్ల సక్సెస్ రేట్ కూడా షేర్ చేసుకోబుతున్నారు.