టాలీవుడ్: 2019 లో 100 శాతం తెలుగు కంటెంట్ టాగ్ లైన్ తో ప్రారంభం అయిన లోకల్ ఓటీటీ ‘ఆహా‘. అల్లు అరవింద్ ప్రారంభించిన ఈ ఆప్ మొదట విజయ్ దేవరకొండ తో ప్రమోషన్ ప్రారంభించారు. ఆప్ ప్రారంభించిన మొదట్లో ఊహించినంత రెస్పాన్స్ లేదు. కానీ లాక్ డౌన్ పుణ్యమా అని ఇపుడు ఆహా కి కూడా సుబ్స్క్రిప్షన్స్ పెరుగుతున్నాయి. అలాగే కంటెంట్ కూడా భారీ గానే సిద్ధం చేస్తున్నారు ‘ఆహా’ టీం.
ఈ మధ్య తమిళ్, మలయాళం లో హిట్ అయిన సినిమాలు అనువాదం చేసి చాలానే విడుదల చేసారు. ‘ట్రాన్స్’, ‘ఫోరెన్సిక్’, ‘షై లాక్’, ’36 వయసులో’, ‘శక్తి’,’జిప్సీ’ ఇలా చెపుతూ పోతే ఈ కోవలో ఇంకా చాలా సినిమాలే వస్తాయి. అలాగే లాక్ డౌన్ లో ఓటీటీల్లో విడుదల అయిన ‘కృష్ణ అండ్ హిస్ లీల ‘, ‘భానుమతి రామకృష్ణ ‘ కూడా మంచి టాక్ ఉండడం వల్ల ఈ రెండు సినిమాలు ఆహా లో ఉండడం వలన ఈ ఆప్ కి కొంచెం ట్రాఫిక్ పెరిగింది. వీటితో పాటు కొన్ని తెలుగు క్లాసిక్ సినిమాలు కూడా కొని ఈ ఆప్ లో ఉంచుతున్నారు. కొత్తగా జోహార్ అనే సినిమా కూడా ఈ ఆగష్టు లో విడుదల చెయ్యబోతున్నారు.
సినిమాల్తో పాటు చాలా వెబ్ సిరీస్ లు కూడా ఆహా లో విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు ఆహా లో వచ్చిన వెబ్ సిరీస్ లు అంతగా క్లిక్ అవనప్పటికీ ముందు ముందు మాత్రం చాలా సిరీస్ లు లైన్ లో ఉన్నాయి. ‘మెట్రో కథలు’ లాంటి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్, మంచి పేరున్న ఆర్టిస్ట్స్ తో ఈ ఆప్ సిరీస్ లలో కూడా సక్సెస్ సాధించే పనిలో ఉంది. వీటితో పాటు ఆన్లైన్ లో ఆడియో వేడుకలు, సక్సెస్ మీట్లు ఏర్పాటు చేసుకునేలా కొత్త ప్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసింది ఈ టీం. ఇది ఇప్పటివరకు ఏ ఆప్ లో కూడా చూడని విషయం. దీని వలన సబ్ స్క్రైబర్స్ మాత్రమే కాకుండా తమ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చే నిర్మాతలు కూడా క్యూ కడతారు. మొత్తానికి సక్సెస్ అవుతాదో అవదో అనుకున్న ఆహా ఆప్ గట్టిగానే నిలబడింది.
Good thing for budding actors,directors etc.