టాలీవుడ్: 100 % తెలుగు కంటెంట్ ని ప్రమోట్ చేస్తూ వెబ్ సిరీస్లు, షోస్ మాత్రమే కాకుండా ఒరిజినల్ కంటెంట్ మూవీస్ ని నిర్మించి విడుదల చేస్తున్నారు ఆహ ఓటీటీ. భానుమతి రామకృష్ణ, కలర్ ఫోటో తర్వాత ఇపుడు ‘సూపర్ ఓవర్’ అనే సినిమాని ఓటీటీ కోసం రూపొందించారు. ఈరోజు ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ని అక్కినేని హీరో నాగ చైతన్య విడుదల చేసారు. క్రికెట్ బెట్టింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. ట్రైలర్ మొదట్లో భీమవరం లో ఉంటూ బిఎండబ్ల్యూ కార్ మైంటైన్ చేస్తున్నాడంటే వీడు పక్కా క్రికెట్ బెట్టింగ్ బూకీ అయ్యుంటాడు అని వైవా హర్ష ని చూసి ఇన్స్పైర్ అయ్యి హీరో నవీన్ చంద్ర బెట్టింగుల్లోకి దిగుతాడు.
ఆలా బెట్టింగుల్లో ఒకసారి కోటి డెబ్భై లక్షలు కోల్పోతాడు. వాటిని తిరిగి ఇచ్చే క్రమంలో పోలీస్ లు , ఛేజ్ మెయిన్ ఎలిమెంట్ గా ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర కి జోడీ గా చాందిని చౌదరి నటిస్తుంది. మరిన్ని పాత్రల్లో వైవా హర్ష, రాకేందు మౌళి, ప్రవీణ్, అజయ్ నటిస్తున్నారు. పర్వీన్ వర్మ అనే నూతన దర్శకుడు ఈ సినిమాని రూపొందించాడు. సన్నీ ఎం.ఆర్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. స్వామి రారా డైరెక్టర్ సుధీర్ వర్మ ఎస్.ఏ.ఎస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించాడు. జనవరి 22 నుండి ఈ సినిమా ఆహా ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది.