న్యూ ఢిల్లీ: భారత్‌లో పలు టెలికాం కంపెనీలు 5జీ టెక్నాలజీని త్వరలో అందుబాటులోకి తేవడానికి కావాల్సిన ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నాయి. దీనిలో భాగంగా భారత్‌కు చెందిన మొబైల్ దిగ్గజ నెట్‌వర్క్ కంపెనీలు 5జీ టెక్నాలజీపై దృష్టిసారించాయి. 5జీ టెక్నాలజీను మరింత వేగంగా విస్తరించడం కోసం ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ తో జతకడుతోంది. 5జీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో ఇరు కంపెనీలు సంయుక్తంగా కలిసి పనిచేస్తాయని ఇవాళ భారతి ఎయిర్‌టెల్ సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపింది. టాటా గ్రూప్ ‘ఓ-రాన్- ఆధారిత రేడియో & ఎన్‌ఎస్‌ఎ / ఎస్‌ఎ కోర్’ ను అభివృద్ధి చేసింది.
టీసీఎస్ ఈ టెక్నాలజీని పూర్తిగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీను ఉపయోగించి ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌ను మరింత వేగంగా అభివృద్ధి చేయనుంది. టీసీఎస్, ఎయిర్‌టెల్ టెక్నాలజి భాగస్వామ్యంతో భారత్‌లో సాంకేతిక రంగాల్లో చాలా పెద్ద మార్పు తప్పకుండా వస్తుందని, అంతేకాకుండా భారత్‌లో వివిధ ఆవిష్కరణలకు మరింత ఊతం ఇస్తుందని భారతి ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం దేశంలోని టెలికాం సంస్థలకు 5జీ టెక్నాలజీ ట్రయల్స్ కోసం అనుమతి ఇచ్చింది. ఈ ట్రయిల్స్ లో భాగంగా ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌ను గుర్గావ్‌లోని సైబర్ హబ్ ప్రాంతంలో 3500 మెగా హెర్ట్జ్ మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో పరీక్షించింది. ఈ పరీక్షలో ఎయిర్‌టెల్ 1 జీబీపీఎస్ స్పీడ్‌ను అందుకోవడం విశేషం.