టాలీవుడ్: ఐశ్వర్య రాజేష్ అని పేరు చెప్తే గుర్తు పట్టలేరు గాని విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో సువర్ణ పాత్ర అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఆ పాత్ర ద్వారా అంతగా ఆకట్టుకుంది ‘ఐశ్వర్య రాజేష్’. తెలుగమ్మాయి అయినా కూడా తమిళ్ ద్వారా ఎక్కువ గుర్తింపు పొంది హీరోయిన్ గా పేరు సంపాదించింది. బర్త్డే పార్టీలు హోస్ట్ చేసే స్టేజ్ నుండి హీరోయిన్ స్టేజ్ కి, హీరోయిన్ గా పనికి రావు అన్న నోటి నుండే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు గోస్ టు ఐశ్వర్య రాజేష్ అనే స్థాయి కి చేరుకున్న నటి ఐశ్వర్య రాజేష్ . రెగ్యులర్ సినిమాలు చేస్తూనే తన నటనకి గుర్తింపు వచ్చే ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలు చేసుకుంటూ దూసుకెళ్తుంది.
లాక్ డౌన్ లో విజయ్ సేతుపతి తో కలిసి నటించిన ‘కా పే రణసింగం’ సినిమా ద్వారా తన నటనకి అందరి ప్రశంసలు అందుకుంది. పక్కన అద్భుతమైన నటుడు విజయ్ సేతుపతి ఉన్నా కూడా ఐశ్వర్య రాజేష్ తన నటన ద్వారా మెప్పించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ‘డ్రైవర్ జమున’ అనే సినిమా ప్రకటించింది. ఈ సినిమాలో ఈ అమ్మాయి క్యాబ్ డ్రైవర్ పాత్రల్లో నటించనుంది. 18 రీల్స్ బ్యానర్ పై ఎస్ఈ చౌదరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పి కిన్ స్లిన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. గిబ్రాన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాతో పాటు ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం నాని సరసన ‘టక్ జగదీశ్’ అనే సినిమాలో కూడా నటిస్తుంది.