ముంబై: భారత్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్ టెస్ట్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ముంబైలో జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో కేవలం ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తిసిన మూడవ బౌలర్‌గా అజాజ్ రికార్డులకెక్కాడు.
రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 47 ఓవర్లు వేసిన ఆజాజ్ పటేల్ 119 పరుగులను ఇచ్చి భారత్ యొక్క 10 వికెట్లు నేలకూల్చాడు. అజాజ్ కంటే ముందు జిమ్ లేకర్ మరియు అనిల్ కుంబ్లే ఈ ఘనతను సాధించారు. ఈ రికార్డును ఇంతకు ముందు 1956లో ఇంగ్లండ్ కు చెందిన జిమ్ లేకర్ ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు సాధించాడు.
ఆ తరువాత 1999లో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌పై 10 వికెట్లు పడగొట్టాడు. ఈ రోజు న్Yఉజిలాండ్ తో జరుగుతున్న రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 325 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా లో మయాంక్ అగర్వాల్ 150 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉండగా అజాజ్ ఘనతపై స్పందించిన అనిల్ కుంబ్లే, ‘‘చాలా బాగా బౌలింగ్ చేశావు. వెల్‌కమ్ టు క్లబ్’’ అంటూ స్వాగతం పలికాడు.