బాలీవుడ్: బాలీవుడ్ లో నిజ జీవిత ఘటనల పైన, భారత్ పాక్ యుద్ధాల పైన, సమకాలీన రాజకీయాల పైన వచ్చే సినిమాల శాతం ఎక్కువగానే ఉంటుంది. దేశం చరిత్రలో జరిగిన ఎన్నో యుద్దాలని ఇతివృత్తంగా తీసుకుని సినిమాలు రూపొందించి సక్సెస్ అవుతుంటారు. ప్రస్తుతం 1971 వ సంవత్సరంలో భారత్ లో భుజ్ లోని వైమానిక స్థావరం పైన పాకిస్తాన్ చేసిన దాడి ఆధారంగా భుజ్ అనే సినిమాని రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.
భుజ్ వైమానిక స్థావరం పై పాక్ యుద్ధ విమానాలతో దాడి చేసి రన్ వే ని కూల్చివేస్తుంది. అలాంటి సమయంలో భారత నేవీ లో ఉన్న ఉన్నతాధికారి పాత్రలో అజయ్ దేవగన్ నటించాడు. అలాంటి సమయంలో యుద్దాన్ని ఎలా హ్యాండిల్ చేసారు, అక్కడి గ్రామస్థులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు లాంటి పరిస్థితులని చూపించారు. పక్కన పెద్ద ఎడారి కావడంతో బాంబులకి బయపడి ఎడారుల్లో ఉండే చిరుతపులులు గ్రామాలకు వచ్చి గ్రామస్తులపై దాడి చేయడాలు లాంటివి చూపించారు. గ్రామస్థులతో కలిసి రన్ వే ని పునరుద్ధరించి యుద్ధం చేసిన విధానాన్ని బాగా చూపించారు.
ఈ సినిమాలో అజయ్ దేవగన్ తో పాటు సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, ప్రణీత, నోరా ఫతేహి నటిస్తున్నారు. టీ సిరీస్, అజయ్ దేవగన్ ఫిల్మ్స్ , సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మించాయి. అభిషేక్ దుధయ్యా దర్శకత్వం వహించిన ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 13 న డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ లో విడుదల అవనుంది.