బాలీవుడ్: బాలీవుడ్ నిజ జీవిత ఘటనల పైన, యుద్ధాల పైన వచ్చే సినిమాల శాతం ఎక్కువగానే ఉంటుంది. దేశం చరిత్రలో జరిగిన ఎన్నో యుద్దాలని ఇతివృత్తంగా తీసుకుని సినిమాలు రూపొందించి సక్సెస్ అవుతుంటారు. అలాంటి దారి లోనే ఇపుడు మరో సినిమా రూపొందుతుంది. అజయ్ దేవగన్ హీరో గా 1971 లో గుజరాత్- భుజ్ లో జరిగిన యుద్ధం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. భుజ్ అనే టైటిల్ తోనే రూపొందిన ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ఈరోజు విడుదల చేసారు. ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. 13 ఆగష్టు నుండి ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమ్ అవనుంది.
ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ లో భాగంగా పాకిస్థాన్ ఇండియా లోని భుజ్ లో ఉన్న ఎయిర్ ఫీల్డ్ పైన 14 రోజుల్లో 35 సార్లు దాదాపు 92 బాంబులతో, 22 రాకెట్ లతో దాడి చేసింది. ఆ సమయంలో యుద్ధం చేసి పోరాడిన కొందరు విండ్ కమాండర్లు, ఆర్మీ ఆఫీషియల్స్ పాత్రలతో ఆ యుద్దాన్ని ‘భుజ్’ అనే టైటిల్ తో తెరకెక్కించారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా , నోరా ఫతేహి, శరద్ కేల్కర్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ ఫిలిమ్స్ మరియు టీ -సిరీస్ సంయుక్తం గా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అభిషేక్ ధుదై దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. 13 ఆగష్టు నుండి ఈ సినిమా హాట్ స్టార్ ఓటీటీ లో స్ట్రీమ్ అవనుంది.
1971. THE GREATEST BATTLE EVER FOUGHT.#BhujThePrideOfIndia releasing on 13th August only on @DisneyplusHSVIP.#DisneyPlusHotstarMultiplex@duttsanjay #SonakshiSinha @AmmyVirk #NoraFatehi @SharadK7 @pranitasubhash @ihanaofficial @AbhishekDudhai6 #BhushanKumar @TSeries pic.twitter.com/35WUFp5GK4
— Ajay Devgn (@ajaydevgn) July 6, 2021