అజిత్ కెరీర్‌లో వాలి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ బ్లాక్‌బస్టర్ ద్వారా అజిత్ డబుల్ రోల్‌లో మెప్పిస్తే, సిమ్రాన్ తన నటనతో ఆకట్టుకుంది. వీరి కాంబినేషన్ ఆ తరువాత పెద్దగా కనబడలేదు. కానీ ఇప్పుడు, ఇన్నేళ్ల తర్వాత ఈ జంట మరోసారి తెరపై కనిపించబోతుందనే వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో సిమ్రాన్ ఒక స్పెషల్ క్యామియో చేస్తున్నట్లు చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో, సిమ్రాన్ ప్రత్యేక సన్నివేశాల్లో అజిత్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట.
ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, జివి ప్రకాష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రభు, సునీల్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తెలుగులో సిద్దు జొన్నలగడ్డ నటించిన జాక్ సినిమాతో పోటీపడనున్న ఈ సినిమా, కోలీవుడ్ ట్రేడ్ ప్రకారం వంద కోట్ల ఓపెనింగ్ సాధించే అవకాశముందట.