కోలీవుడ్: రజినీకాంత్ తర్వాత తమిళ సినిమా ఇండస్ట్రీ లో అంత క్రేజ్, ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో విజయ్ , అజిత్ ముందు వరుసలో ఉంటారు. రజిని లాగే తన సింప్లిసిటీ కి అజిత్ కి ఫాన్స్ ఎక్కువ ఉంటారు. అజిత్ కి ఒక డైరెక్టర్ వర్క్ నచ్చితే అతనితో వరుసగా సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇదివరకే ‘శివ’ అనే డైరెక్టర్ తో వేదాళం, వివేకం, విశ్వాసం అనే మూడు సినిమాలు వరుసగా చేసాడు. ఇపుడు మరో డైరెక్టర్ తో మూడవ సినిమాకి కమిట్మెంట్ ఇచ్చాడు హీరో అజిత్. ఈ సారి కేవలం డైరెక్టర్ మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ తో కూడా ఇదే కాంబినేషన్ లో మూడవ సినిమా అవడం విశేషం.
పింక్ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తే తమిళ్ లో అజిత్ రీమేక్ చేసాడు. ‘నెర్కొండ పారవై’ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమాని బోనీ కపూర్ నిర్మాణంలో హెచ్.వినోత్ అనే దర్శకుడి నేతృత్వంలో రూపొందించి సూపర్ హిట్ కొట్టారు. ఇదే ప్రొడ్యూసర్ , డైరెక్టర్ కాంబినేషన్ లో అజిత్ హీరోగా ప్రస్తుతం ‘వాలిమై’ అనే సినిమా రూపొందుతుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ సినిమా పూర్తవకుండానే ఈ కాంబినేషన్ లో మూడవ సినిమా కూడా ప్రకటించారు.