గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఫుల్ పవర్ మోడ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ‘అఖండ 2’ చిత్రాన్ని డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని ఇప్పటికే టాక్ రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
గోదావరి ప్రాంతంలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్, ఇప్పుడు కొత్త లొకేషన్స్ వేటలో ఉంది. తాజా సమాచారం ప్రకారం, ‘అఖండ 2’ కోసం బోయపాటి శ్రీను జార్జియాలో కీలక షెడ్యూల్ ప్లాన్ చేశాడు. మే మొదటి వారంలో చిత్ర బృందం జార్జియాకు బయలుదేరనుంది.
అక్కడ బాలయ్యతో పాటు మరికొందరు నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. జార్జియాలో మేజర్ యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో బాలయ్య మళ్లీ అఘోర గెటప్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పై ఫ్యాన్స్ విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, యంగ్ హీరో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ‘అఖండ 2’ పై బాలయ్య ఫ్యాన్స్ హై హోప్స్ పెట్టుకున్నారు.