అఖిల్ అక్కినేని తన కెరీర్‌లో మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు స్టైలిష్ యాక్షన్, రొమాంటిక్ హీరోగా కనిపించిన అఖిల్, ఈసారి పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరుతో ఆయన ఓ ఇంటెన్స్ డ్రామా చేయనున్నట్లు టాలీవుడ్‌లో బలమైన టాక్ ఉంది.
ఈ కథ పూర్తిగా చిత్తూరు ప్రాంతపు నేపథ్యం లో సాగనుందని సమాచారం. టాలీవుడ్‌లో రాయలసీమ కథలు ఎక్కువగా కనిపించినా, చిత్తూరు యాసను పూర్తిగా కవర్ చేసిన సినిమాలు తక్కువ. ఈ సినిమా ఆ లోటును భర్తీ చేయనుందని భావిస్తున్నారు. అఖిల్ కూడా కొత్త తరహా పాత్ర కోసం ప్రత్యేకంగా డైలాగ్ డెలివరీ ప్రాక్టీస్ చేస్తున్నట్లు టాక్.
ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలు చేసిన అఖిల్, ఈసారి కథను నమ్ముకుని ప్రయోగం చేయాలని భావిస్తున్నాడు. మట్టి వాసన వచ్చే కథ కావడంతో, ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారనున్నాయి.
ఇందులో యాక్షన్, ఎమోషన్ మిక్స్ చేసిన కథాంశం ఉండనుందని సమాచారం. గత చిత్రాల్లో కథా బలహీనత వల్ల కొన్ని తప్పిదాలు చేసిన అఖిల్, ఈసారి మెచ్యూర్డ్ కథతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు టాక్.
ఇప్పటివరకు అభిమానులకు అతనిపై ఉన్న అభిప్రాయాన్ని ఈ సినిమా పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మరి, ఈ ప్రయోగం అఖిల్ కెరీర్‌కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి!