fbpx
Wednesday, December 18, 2024
HomeMovie Newsఅఖిల్ న్యూ స్టార్ట్.. సూపర్ హిట్ ప్లాన్

అఖిల్ న్యూ స్టార్ట్.. సూపర్ హిట్ ప్లాన్

AKHIL-NEW-START-SUPER-HIT-PLAN
AKHIL-NEW-START-SUPER-HIT-PLAN

మూవీడెస్క్: అక్కినేని అఖిల్ గత చిత్రం ‘ఏజెంట్’ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఫలితంతో అఖిల్ కొంత గ్యాప్ తీసుకుని కొత్త సినిమాపై దృష్టి పెట్టాడు.

మొదట యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త దర్శకుడు అనిల్ కుమార్ తో ప్రాజెక్ట్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

తాజాగా, అఖిల్ హోమ్ బ్యానర్ మనం ఎంటర్టైన్మెంట్ లో మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.

చిత్తూరు నేపథ్యంలో పీరియాడికల్ లవ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా 2025 ప్రారంభంలో షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

నాగార్జున, నాగ చైతన్య కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారని టాక్. ఇదే కాకుండా, ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా శ్రీలీల నటించనున్నారని తెలుస్తోంది.

మరో విశేషం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా భాగస్వామిగా ఉంటుందని టాక్.

సితార ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల వరుస విజయాలు సాధించడంతో ఈ మూవీకి మార్కెట్ పరంగా లాభదాయకంగా మారుతుందని అంచనా.

‘వినరో భాగ్యము విష్ణు కథ’తో హిట్ అందుకున్న మురళీ కిషోర్ అబ్బూరు, ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా అఖిల్ కెరీర్ ను బలపరచగలడా అనేది ఆసక్తికరం.

మేకర్స్ అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నారు. అఖిల్ ఈ చిత్రంతో మరోసారి బిగ్ హిట్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular