హైదరాబాద్: అక్కినేని ఫామిలీ నుండి వచ్చి తనకి ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో సుమంత్. ఈ తరం అక్కినేని హీరోల్లో తాతగారి మ్యానరిజమ్స్ ఎక్కువగా వచ్చినవి ఈ హీరోకే. సుమంత్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కపటధారి’. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రాబోతోంది ఈ సినిమా. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కపటధారి’ . ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. లలిత ధనంజయన్ నిర్మిస్తున్నారు. చాలా ప్లాప్ ల తర్వాత ‘మళ్ళీ రావా’ లాంటి రెఫ్రెషింగ్ హిట్ తో వచ్చాడు సుమంత్. ఆ తర్వాత వచ్చిన సుబ్రమణ్యపురం, ఇదం జగత్ పరవాలేదనిపించాయి కానీ అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు తరువాతి ప్రయత్నంగా కాప్ రోల్ లో ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో.
ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు యువ సామ్రాట్ నాగచైతన్య విడుదల చేసాడు. ఫస్ట్ లుక్ లో సుమంత్ ట్రాఫిక్ పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ లో ఇచ్చిన ‘ఆర్టికల్ 352‘ అంటే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సిటిజెన్ ప్రైమరీ హక్కుల్ని కూడా సస్పెండ్ చెయ్యడం అనే కాన్సెప్ట్ వాడుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ కాన్సెప్ట్ తో తెలుగులో సినిమాలు రాలేదు. మరి దీనిని ఎంత వరకు సఫలీకృతం చేసుకుంటాడో డైరెక్టర్ ప్రదీప్ కృష్ణమూర్తి చేతుల్లో ఉంది. సుమంత్ తో పాటు ఈ సినిమాలో నాజర్, నందిత శ్వేత, పూజా కుమార్, వెన్నెల కిషోర్, జయప్రకాశ్, సంపత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సైమన్ కె. కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. డా.ధనుంజయన్ స్క్రీన్ప్లే అడాప్షన్ చేయగా, బాషాశ్రీ మాటలు అందిస్తున్నారు.
is this a remake?