హైదరాబాద్: ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నాగార్జున కి ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమా టీం పోస్టర్ విడుదల చేసి విషెస్ తెలిపింది. మన్మధుడు 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నాగార్జున చేస్తున్న సినిమా ఇది. మన్మధుడు 2 డిసాస్టర్ తర్వాత చాలా కథలు విన్న నాగార్జున పోలీస్ చేజ్ డ్రామా కి మొగ్గు చూపాడు. ఈ సినిమా చేస్తున్నాడు అని వార్త తెలిసినప్పటికీ ఇప్పటి వరకి ఈ సినిమా టీం నుండి అఫిషియల్ అప్డేట్ ఏమి లేదు. ఈ రోజు ఈ సినిమా పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమాలో ఎన్ ఐ ఏ ఏజెంట్ విజయ్ వర్మ గా నాగార్జున నటించబోతున్నాడు.
ఈ సినిమాలో నాగార్జున తో పాటు బిగ్బాస్ ఫేమ్ అలీ రెజా, సయామీ ఖేర్, దియా మీర్జా , అతుల్ కులకర్ణి కూడా నటిస్తున్నారు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిరంజన్ రెడ్డి, అశ్విన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సోలమన్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం అవబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. మరి కొంత భాగం కరోనా వాళ్ళ ముందుకు సాగలేదు. అయితే నాగార్జున తన పుట్టినరోజు తర్వాత మల్లి షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు తెలిపాడు. అదే విధంగా బిగ్ బాస్ కూడా సోమవారం నుండి షూటింగ్ లో పాల్గొన బోతున్నా అని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.