fbpx
Sunday, December 22, 2024
HomeMovie Newsఏప్రిల్ 2 న నాగార్జున 'వైల్డ్ డాగ్'

ఏప్రిల్ 2 న నాగార్జున ‘వైల్డ్ డాగ్’

AkkineniNagarjuna WildDog ReleasingInApril

టాలీవుడ్: అక్కినేని నాగార్జున ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. భాయ్, మన్మధుడు 2 డిజాస్టర్స్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత ‘వైల్డ్ డాగ్’ అనే ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ లో నటించాడు. ఈ సినిమా షూటింగ్ చాల రోజుల క్రితమే ముగిసినప్పటికీ లాక్ డౌన్ సమయంలో ఓటీటీ తో చేసుకున్న ఒప్పందం వలన ఇన్ని రోజులు ఈ సినిమా విడుదలపై అనుమానాలు ఉండేవి. చివరకి ఓటీటీ వారితో చర్చలు ఫలించి ఎట్టకేలకి ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

లాక్ డౌన్ ముగిసినా కూడా జనాలు థియేటర్లకు వస్తారో రారో అనే సందేహం తో ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు నిర్మాతలు. కానీ థియేటర్ లు తెరుచుకున్న తర్వాత క్రాక్, ఉప్పెన సినిమాలకి వచ్చిన రెస్పాన్స్ ని చూసి ఈ సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుందని థియేటర్లలో విడుదల చేయిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 2 న విడుదల చేయబోతున్నట్టు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అహిషోర్ సాల్మోన్ అనే దర్శకుడు ఈ సినిమా ద్వారా తెలుగు కి పరిచయం అవుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular