fbpx
Saturday, November 2, 2024
HomeNationalఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ మోడీ కీలక నిర్ణయం!

ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ మోడీ కీలక నిర్ణయం!

AKSHARMA-UTTARPRADESH-BJP-VICEPRESIDENT-APPOINTED-BY-MODI

లక్నో: 2022 లో ఉత్తరప్రదేశ్ లో జరగబోయే‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామాలు మొదలయ్యాయి. దీనికి సంకేతంగా నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీకి ఉపాధ్యక్షుడిగా తన ఆప్తుడు మరియు మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన ఏకే శర్మను సిఫార్సు చేశారు. ఈ నియామకాన్ని పార్టీ అధిష్టానం ధృవీకరిస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌ శనివారం పలు కీలక పదవులకు సంబంధించిన నేతల పేర్లను విడుదల చేసారు. వీరిలో ఏకే శర్మతో పాటు రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా లక్నోకు చెందిన అర్చనా మిశ్రా, బులంద్‌ షహర్‌కు చెందిన అమిత్‌ వాల్మీకిని కూడా నియమిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్‌లో ఐఏఎస్‌ అధికారిగా పనిచేసిన ఏకే శర్మ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కాగా, ఏకే శర్మ స్వస్థలం యూపీలోని మావ్‌.

గుజరాత్ లో అప్పట్లో వైబ్రంట్‌ గుజరాత్‌ తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి నరేంద్ర మోదీకి చేరువయ్యాడు శర్మ. ఆమధ్య తన నియోజకవర్గం వారణాసిలో కరోనా సమీక్ష కోసం శర్మనే, నరేంద్ర మోదీ పంపడం కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు యూపీ కేబినేట్‌ విస్తరణ ఊహాగానాల్లో ఏకే శర్మకు స్థానం దక్కుతుందని కూడా అంతా భావించారు. ఇక తన నియామకంపై ఏకే శర్మ ప్రధానికి మరియు పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

యోగి హయాంలో యూపీ పాలనపై, కరోనా కట్టడిలో విఫలమయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం మార్పులు చేయబోతోందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అదంతా మీడియా సృష్టేనని బీజేపీ నేతలు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తేల్చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular