హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తన సినిమాటిక్ యూనివర్స్‌లో మూడో చిత్రంగా మహాకాళిని ప్రకటించిన సంగతి తెలిసిందే. లేడీ సూపర్ హీరో కథతో రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటించనున్నట్లు అధికారికంగా వెల్లడైంది.
ఇటీవలే ఛావా సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో నటించిన అక్షయ్ ఖన్నా, ఈ సినిమాలో విలన్ రోల్‌లో కనిపించనున్నారనే అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసిన ఈ సమాచారంను ప్రశాంత్ వర్మ స్వయంగా రీట్వీట్ చేయడంతో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది.
ఈ చిత్రాన్ని రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తుండగా, ఆర్.కె.దుగ్గల్ సమర్పిస్తున్నారు. పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. బెంగాల్ సంస్కృతి నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ లేడీ సూపర్ హీరో కథ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.
టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన రావడం, అక్షయ్ ఖన్నా లాంటి నటుడి చేరికతో ఈ ప్రాజెక్టుపై హైప్ మరింత పెరిగింది. కథలో ఆయన పాత్రకు కీలక ప్రాధాన్యం ఉండనుందని సమాచారం.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో వస్తున్న మహాకాళి సినిమా మరోసారి PVCU క్రేజ్‌ను కొనసాగించగలదా అన్నది ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది.