fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsజులై లో థియేటర్లలో అక్షయ్ 'బెల్ బాటమ్'

జులై లో థియేటర్లలో అక్షయ్ ‘బెల్ బాటమ్’

AkshayKumar BellBottom ReleaseDateAnnouncement

బాలీవుడ్: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడడం తో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సమయంలో కొత్త సినిమాలు ఎన్నో విడుదలకి సిద్ధంగా ఉన్నాయ్. అందులో అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’. ఈ సినిమాని జులై లో థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ఈరోజు ప్రకటించారు. పోయిన సంవత్సరం అక్షయ్ నటించిన ‘లక్ష్మీ బాంబు’ హాట్ స్టార్ ఓటీటీ లో విడుదల అవడం తో ఈ సినిమా కూడా ఓటీటీ లోనే విడుదల అవచ్చు అని అనుకున్నారు కానీ అక్షయ్ థియేట్రికల్ రిలీజ్ ప్రకటించారు.

ఈ సినిమా ఒక పీరియాడిక్ సినిమాగా రూపొందింది. 1980 ల్లో జరిగిన యథార్థ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో అక్షయ్ ఒక రా ఏజెంట్ గా కనిపించనున్నారు. ఈ మధ్య అక్షయ్ కుమార్ నుండి వస్తున్న సినిమాలన్నీ దాదాపు యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన పీరియాడిక్ కథలతోనే వస్తున్నాయి. ఈ సినిమాలో అక్షయ్ కి జోడీ గా వాణి కపూర్, హుమా ఖురేషి నటిస్తున్నారు. పూజా ఎంటర్టైన్మెంట్ , ఎమ్మా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై వషూ భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్ముఖ్, మోనీషా అద్వానీ , మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ కలిసి ఈ సినిమాని నిర్మించారు. రంజిత్ ఎం.తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై 27 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular