బాలీవుడ్: రియల్ లైఫ్ స్టోరీస్, రియల్ ఇన్సిడెంట్స్, రియల్ వార్స్ ని బేస్ చేసుకుని బాలీవుడ్ లో చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో అక్షయ్ కుమార్ చేసే సినిమాల శాతం కూడా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ అలాంటి ఒక సబ్జెక్టు తోనే మన ముందుకు రానున్నాడు 1984 లో జరిగిన ఒక ఫ్లైట్ హైజాక్ కి సంబందించిన కథ ని బేస్ చేసుకుని ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.
210 మంది భారతీయలు ప్రయాణించే విమానాన్ని నలుగురు ముష్కరులు దుబాయ్ లో హై-జాక్ చేస్తారు. సినిమా మొత్తం ఈ హైజాక్ ని బేస్ చేసుకుని ఆ ప్రయాణీకుల్ని కాపాడే ఎత్తుగడలే సినిమా కథనం అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆఫీస్ లో వరుస హైజాక్ ల గురించి చర్చ జరుగుతుండగా దీన్ని కాపాడాలంటే ఒక వ్యక్తి కావలి, ఆ వ్యక్తి కోడ్ -‘బెల్ బాటమ్’ అని అంటుండగా అక్షయ్ కుమార్ ఎంట్రీ ఇస్తాడు. దుబాయ్ లో ఉన్న ఇండియన్స్ ని కాపాడి టెర్రరిస్ట్ లని ఎదుర్కొనే వ్యూహాలు ప్రేక్షకులని థ్రిల్ కి గురి చేస్తాయి అన్నట్టు చూపించారు. ట్రైలర్ చివర్లో ఒక సాండ్ స్ట్రామ్ (ఇసుక తుఫాను) లాంటి విజువల్ చూపించి ఆసక్తి కలిగేలా చేసారు.
ఈ సినిమాలో అక్షయ్ తో పాటు వాణి కపూర్, హుమా ఖురేషి నటించారు . పూజా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎమ్మె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై వశు భగ్నానీ , జాకీ భగ్నానీ. దీప్సిక దేశముఖ్, మోనిష అద్వానీ, మధు భొజ్వాని, నిఖిల్ అద్వానీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రంజిత్ ఎం.తివారి ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. ఆగష్టు 19 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవనుంది.