బాలీవుడ్: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా ‘రామ సేతు’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రామసేతు అంటే రామాయణం లో శ్రీ రాముడు సీతమ్మ కోసం శ్రీ లంక కి వెళ్ళడానికి కట్టిన వారధి. ఈ సినిమాకి మరి ఆ వారధి కి కనెక్షన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ఆ రామ సేతు కి సంబందించిన గుర్తులని కనిపెట్టే పురావస్తు శాఖ శాస్త్రవేత్త గా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ అయోధ్యలో ప్రారంభం అయింది. ఈ సినిమా నుండి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ ఒకటి విడుదల చేసారు.
హిస్టరీ కి ఫిక్షన్ ని జోడించి ఒక ఇంట్రెస్టింగ్ కథ తో ఈ సినిమా రూపొందనున్నట్టు తెలుస్తుంది. ఇదివరకే తెలుగులో ద్వారకా బ్యాక్ డ్రాప్ లో ఒక హిస్టారికల్ ఫిక్షన్ కాంబినేషన్ లో వెంకటేష్ హీరోగా ‘దేవి పుత్రుడు’ సినిమా రూపొందించారు. ఈ సినిమా అంతగా ఆడకపోయినా కానీ మంచి గుర్తింపు లభించింది. ఈ రామసేతు కూడా ఆ జానర్ కిందికే వస్తుందా లేదా అనేది విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో అక్షయ్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ , నుష్రాత్ భరుచ్ఛా నటిస్తున్నారు. ‘పరమాణు’ సినిమాని డైరెక్ట్ చేసిన అభిషేక్ శర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. చంద్ర ప్రకాష్ ద్వివేది సమర్పణలో కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ,అబండంటియా ఎంటర్టైన్మెంట్ , లైకా ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు