బాలీవుడ్: సౌత్ లో విడుదలై మంచి సక్సెస్ సాధించిన ‘కాంచన’ సినిమాని అక్షయ్ కుమార్ హీరోగా ‘లక్ష్మి బాంబ్’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఒరిజినల్ మూవీ ని డైరెక్ట్ చేసిన రాఘవ లారెన్స్ దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబర్ 9 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో విడుదల చెయ్యబోతున్నారు మేకర్స్. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘కియారా అద్వానీ’ నటిస్తుంది.
ఒరిజినల్ సినిమాలనే ఈ సినిమాలో కూడా కామెడీ, భయం మెయిన్ ఎలెమెంట్స్ గా తీశారు. కానీ సినిమా నడిచే బ్యాగ్రౌండ్ ని కొంచెం మార్చారు. ఒరిజినల్ కాంచన సినిమాలో కథ అంత హీరో ఇంట్లో నడుస్తుంది. కానీ ఇందులో హీరోయిన్ ఇంట్లో నడుస్తుంది. దుబాయ్ లో హీరో హీరోయిన్ ప్రేమించుకుని , అమ్మాయి తల్లి తండ్రులని ఒప్పించడానికి హీరోయిన్ ఇంటికి వచ్చినపుడు కాంచన రూపం లోని దయ్యం అక్షయ్ కుమార్ ని ఆవహిస్తుంది. మొత్తం గా చెప్పాలంటే కాంచన ఒరిజినల్ వెర్షన్ చూసిన వారికి ఈ విషయం ఇట్టే అర్ధం అయిపోతుంది.
ట్రైలర్ ఆద్యంతం కామెడీ తో ఆకట్టుకున్నాడు. ఒరిజినల్ వెర్షన్ కంటే కమెర్షియల్ హంగులు ఈ సినిమాలో ఎక్కువే ఉన్నాయ్. ఈ సినిమాని కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఎంటర్టైన్మెంట్, తుషార్ ఎంటర్టైన్ ప్రొడక్షన్ హౌసెస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి తనీష్ బాగ్చీ, శశీ ఖుషీ, అనూప్ కుమార్ సంతీతం అందించగా అమర్ మోహిలే బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటి వారికి డైరెక్ట్ఓ టీటీ ల్లో విడుదలైన సినిమాల్లో ఇదే పెద్ద సినిమా.