బాలీవుడ్: టాలీవుడ్ తో పోలిస్తే బాలీవుడ్ లో వచ్చే సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు చాలా తక్కువే. టాలీవుడ్ లో ప్రతీ హీరో ఏదో ఒక స్టేజి లో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు చేసి ఉన్నారు. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘రక్షా బంధన్’ అనే సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసాడు ఈ హీరో. ఈ ఫొటోలో నలుగురు చెల్లెళ్లను ఆప్యాయంగా హత్తుకున్న అక్షయ్ కుమార్ ఆనందంగా కనిపిస్తున్నాడు.
ఈ సినిమా కథ చాలా హృద్యంగా ఉంటుందని గుండె లోతుల వరకు ఈ కథ చేరుకుంటుందని చెప్పారు అక్షయ్. అలాగే కథ విన్న తర్వాత అతి త్వరగా తన కెరీర్ లో ఒప్పుకున్న సినిమా కూడా ఇదేనట. ఈరోజు రక్షా బందన్ సందర్భంగా ఈ సినిమాని తన సిస్టర్ ‘అల్కా’ కి అలాగే అన్న చెల్లెలు లేదా అక్క తమ్ముడు లాంటి చాలా విలువైన బంధానికి అంకితం ఇస్తున్నట్టు చెప్పారు అక్షయ్. అక్షయ్ ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వం లో చేస్తున్న ‘లక్ష్మి బాంబు’ పూర్తి చేసే పని లో ఉన్నాడు. ఈ సినిమా తెలుగులో వచ్చిన కాంచన సినిమాకి రీ – మేక్. ఈ సినిమాకి సంబందించిన అన్ని పనులు ముగించుకొని వచ్చే నెలలో ఓటీటీ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.