బాలీవుడ్: బాలీవుడ్ లో ప్రయోగాత్మక కథలు మరియు రియల్ స్టోరీస్ తో సినిమాలు తీస్తూ సక్సెస్ఫుల్ చేస్తున్న హీరోల్లో అక్షయ్ కుమార్ ముందుంటాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇపుడు మరో రియలిస్టిక్ కథతో మన ముందుకు రాబోతున్నాడు. రామాయణం లో రాముడు సీతని తీసుకురావడం కోసం లంక కి వెళ్ళడానికి వానర సేన సహాయంతో కట్టిన వారధి ‘రామ సేతు’. ఆ వారధి కథని ఇతివృత్తంగా తీసుకొని అక్షయ్ కుమార్ ఒక సినిమా తీస్తున్నాడు. రామసేతు అనే పేరుతోనే ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ఫస్ట్ లుక్ తోనే అక్షయ్ ఆకట్టుకున్నారు.
ఈ దీపావళి సందర్భంగా ఈ సినిమాని ప్రకటించి ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ దీపావళి అందరికీ సంతోషాలను ఆనందాల్ని ఇవ్వాలి. మన మధ్య ఉన్న చిన్న చిన్న అంతరాలను అడ్డుగోడలను చెరిపివేయాలి. శ్రీరాముడి ఆదర్శాలను మనమంతా అనుసరిస్తూ ఆదర్శవంతంగా ముందుకుసాగుదాం. రాముడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సినిమా ద్వారా ప్రయత్నిద్దాం. అందరికీ మరోసారి దీపావళి పండగ శుభాకాంక్షలు’ అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేసారు.కేప్ అఫ్ గాడ్ ఫిలిమ్స్ సమర్పణలో అరుణ్ భాటియా, విక్రమ్ మల్హోత్రా నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకి అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నమ్మకమా లేక నిజామా’ అనే ప్రశ్నార్ధకం పెట్టి ఈ సినిమా పోస్టర్ విడుదల చేసారు. అంటే రామ సేతు నిజామా కాదా అనే అన్వేషణ ఆధారంగా కథనం ఉండొచ్చు అని అనిపిస్తుంది.