బంగ్లాదేశ్: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఉద్యోగాల్లో కోటా విషయంలో ఆందోళనదారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఈ ఘర్షణల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అలాగే, అనేక మందికి గాయాలైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఇదే అంశంపై గతంలో జరిగిన అల్లర్లలో దాదాపు 200 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో, బంగ్లాదేశ్ హోంశాఖ దేశ వ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించింది.
పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో వరుసగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్త వాతావరణాన్ని భారత్ దగ్గరగా పరిశీలిస్తోంది.
ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలపై భారత్ తక్షణమే స్పందించింది.
ఈ సందర్భంలో, బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయ పౌరులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక సూచనలు జారీ చేసింది.
విద్యార్థులు సహా అందరూ తమతో అందుబాటులో ఉండాలని సిల్హట్‌లోని అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియా సూచించింది. అలాగే, స్థానిక కార్యాలయ ఫోన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచింది.
ప్రధానమంత్రి షేక్ హసీనా, విధ్వంసానికి పాల్పడుతున్నవారు విద్యార్థులు కారని, ఉగ్రవాదులని ప్రకటించారు.