మూవీడెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇటీవల జరిగిన ‘జిగ్రా’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన మనసులో మాట చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అక్టోబర్ 11న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించి జరిగిన ఈవెంట్ లో అలియా, తెలుగు స్టార్ హీరోయిన్ సమంతపై ప్రశంసలు కురిపించారు.
సమంత తన కెరీర్ లో ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లో కూడా హీరోలా నిలిచిందని, ఆమె ప్రయాణం అందరికీ ఆదర్శమని అలియా అన్నారు.
ఇక సమంతతో కలిసి నటించాలని తాను ఆశిస్తున్నట్లు అలియా వెల్లడించారు. అలాంటి సినిమాకు త్రివిక్రమ్ సార్ దర్శకత్వం వహిస్తే అద్భుతం అవుతుందని ఆమె అన్నారు.
త్రివిక్రమ్ గారు తాను చెప్పిన మాటలను పాజిటివ్ గా స్వీకరించాలంటూ స్టేజ్ పైనే అలియా రిక్వెస్ట్ చేశారు.
ఇక ఈ విషయంపై సమంత కూడా సైగలతో స్పందించి, త్రివిక్రమ్ సార్ తాము కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు పరోక్షంగా హామీ ఇచ్చారు.
ఈ ఇద్దరు స్టార్ లేడీస్‌తో త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తే అది పాన్ ఇండియా లెవల్ లో సెన్సేషన్ అవుతుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.