టాలీవుడ్: టాలీవుడ్ క్రేజీ మూవీ RRR సినిమా షూటింగ్ షర వేగంగా జరుగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా షూటింగ్ చేస్తున్నాడు డైరెక్టర్ రాజమౌళి. ఈ మధ్యనే 50 రోజుల భారీ యాక్షన్ సీక్వెన్స్ ని మొత్తం రాత్రి పూటనే షూట్ చేసి ఆ షెడ్యూల్ ముగించారు. ఆ వెంటనే మహా బలేశ్వర్ లో కొన్ని రోజుల్లో ఒక చిన్న షెడ్యూల్ పూర్తి చేసారు. అది ముగించేసి హైదరాబాద్ లో మల్లి షూట్ మొదట్ల పెట్టారు. ఈ షెడ్యూల్ లో ఆలియా సీన్స్ కొన్ని షూట్ చేయబోతున్నారు. ఇందుకోసం అలియా కూడా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యి RRR షూటింగ్ లో జాయిన్ అయింది.
ఈ సినిమా ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తుండడం తో వివిధ బాషల నుండి పేరున్న స్టార్స్ ని ఈ సినిమాలో నటింపచేస్తున్నారు. ఆలియా బట్ మాత్రమే కాకుండా బాలీవుడ్ నుండి అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు. అలియా షూట్ లో జాయిన్ అయినట్టు డైరెక్టర్ రాజమౌళి ట్వీట్ ద్వారా తెలియ చేసాడు. లాక్ డౌన్ వల్ల ఇన్ని రోజుల వచ్చిన గ్యాప్ ని పూరించడానికి రాజమౌళి అండ్ టీం చాలా కష్టపడుతున్నారు అతి తొందరగా షూట్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించి 2021 సమ్మర్ వరకు విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.