జెరూసలెం: భూమి మీద మానవులకు ఎప్పుడూ అంతరిక్షం, ఏలియన్స్ వంటి విషయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక హాలీవుడ్‌లో ఏలియన్స్ సినిమాలు కూడా పెద్ద విజయాల్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఏరియా 51 అనే ప్రాంతంలో అమెరికా సైన్యం గ్రహాంతరవాసులను బంధించి పెట్టింది. వాళ్ల నుంచే అధునాతన టెక్నాలజీని ఆ దేశం పొందుతోంది అనే వార్తలు ఏన్నో ఏళ్లుగా ప్రాచుర్యం లో ఉన్నాయి.
ఈ తరుణంలో తాజాగా ఓ ఇజ్రాయేల్ మాజీ జనరల్ ఏలియన్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గ్రహంతర వాసులు నిజంగా ఉన్నారని, వారు భూమ్మీద మనతో పాటు కలిసి తిరుగుతున్నారని అన్నారు. మాజీ ఇజ్రాయెల్ జనరల్, ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పని చేస్తున్న హైమ్ ఎషెడ్ ఒక ఇంటర్వ్యూలో ఏలియన్స్ నిజంగానే ఉన్నారని, వారు రహస్యంగా మన ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నారని, వారి సమయాన్ని మనతో వెచ్చిస్తున్నారని తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా ఏలియన్స్‌తో కలిసి అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. అయితే భూమ్మీద వారిని అంగీకరించే పరిస్థితులు లేనందున ఈ విషయాలని రహస్యంగా ఉంచారని జెరూసలేం పోస్టుకిచ్చిన ఇంటర్వ్యూలో హైమ్ తెలిపారు.