మూవీడెస్క్: అల్లరి నరేష్ తన కెరీర్‌లో మరో యూ టర్న్ తీసుకోబోతున్నారు.
గతంలో కామెడీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్, ‘నాంది’ వంటి సీరియస్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఇప్పుడు మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సుబ్బు మంగదేవి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బచ్చల మల్లి’ సినిమా డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతోంది.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నిర్మాత రాజేష్ దండా ఈ సినిమాను భారీ అంచనాల మధ్య నిర్మిస్తున్నారు.
నరేష్ ఈ చిత్రంలో మాస్ అవతారంలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
డిసెంబర్ 20న నరేష్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది.
అదే రోజున బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘భైరవం’ మరియు నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.
వీటితో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
ఈ భారీ పోటీలో ‘బచ్చల మల్లి’ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
నరేష్ కెరీర్‌లో ఈ సినిమా మరో బెస్ట్ మూవీ గా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మరి నరేష్ తన సీరియస్ పాత్రతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.