హైదరాబాద్: ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లరినరేష్ కి కానుకగా తాను నటిస్తున్న ‘నాంది‘ టీం ఈరోజు టీజర్ ని రిలీజ్ చేశారు. సినిమా పేరుకి తగ్గట్టే ఒక కొత్తరకం సినిమాలకి, అల్లరి నరేష్ కి కొత్త రకం ఇమేజ్ తీసుకొచ్చేందుకు నాంది పలికేలా ఉంది ఈ సినిమా టీజర్. 1.28 నిమిషాల నిడివి గల ఈ టీజర్ లో కొంత స్టోరీ చెప్పేందుకు, అలాగే సినిమా పైన కొంత ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేసాడు డైరెక్టర్ విజయ్ కనకమేడల, ఈ సినిమాని మరొక డైరెక్టర్ శతమానం భవతి ఫేమ్ ‘సతీష్ వేగేశ్న’ నిర్మిస్తున్నారు.
టీజర్ లో అమాయకమైన వ్యక్తిని ఏ సంబంధం లేకుండా అరెస్ట్ చేసి జైలు కి పంపించి అక్కడ రకరకాలుగా ఇబ్బంది పెట్టే సన్నివేశాలు చూపించారు. కానీ ఎందుకు అరెస్ట్ చేసారు లాంటి విషయాలు డైరెక్టర్ సస్పెన్స్ మైంటైన్ చెయ్యడానికి ప్రయత్నించారు. నరేష్ తరపున వాదించే లాయర్ పాత్రలో ‘వరలక్షి శరత్ కుమార్’ పాత్ర ఉంటున్నట్టు అర్ధం ఐతుంది. అలాగే టీజర్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టు కుదిరింది. ఇదివరకే ‘శ్రీ చరణ్ పాకాల‘ కి క్షణం, గూఢచారి, గరుడవేగా , ఎవరు లాంటి సినిమాలకి మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన పేరుంది. టీజర్ చివర్లో అల్లరి నరేష్ చెప్పే డైలాగ్ తో సినిమా థీమ్ చెప్పారు డైరెక్టర్. ‘ఒక బిడ్డ జన్మించడానికి 9 నెలల సమయం పడుతుంది కానీ ఒక తీర్పు రావడానికి ఇంత సమయం ఎందుకు పడుతుంది’ అని ప్రస్తుతం కోర్ట్ లో పెండింగ్ లో ఉన్న కేసుల గురించి కోర్ట్లో తీర్పుల అలసత్వం గురించిన సబ్జెక్టు గా అర్ధం అవుతుంది. కొంత స్టోరీ , కొన్ని సన్నివేశాలు తమిళ్ లో వచ్చిన ‘విసరణైః’ కి పోలికలు ఉన్న కూడా మేకర్స్ ఏ విధమైన అధికారిక ప్రకటన వెలువరించలేదు.